News February 15, 2025
కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News October 29, 2025
తిరుపతి: ఇవాళ స్కూళ్లకు సెలవు లేదు

తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఇవాళ నుంచి యథావిధిగా పనిచేయాలని DEO కేవీఎన్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడారు. DYEOలు, MEOలు, HMలు కలెక్టర్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి, అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ సమాచారం తెలియజేయాలని పేర్కొన్నారు. పాఠశాలలు ఇవాళ నుంచే సాధారణంగా పనిచేసేటట్లు చూడాలని అన్నారు.
News October 29, 2025
త్వరలో మదనపల్లి జిల్లా సాకారం?

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా మారింది. నాడు మదనపల్లిని అన్నమయ్య జిల్లాలో కలపడం కంటే జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీనికి అనుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సీఎం చర్చించారు. త్వరలో దీనిపై ఆమోదం తెలిపి మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పుంగనూరు లేదా పీలేరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం మదనపల్లిపై మీ కామెంట్.
News October 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 50

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ఏంటి?
2. త్రిపురాంతకుడు అంటే ఏ దేవుడు?
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరింది ఎవరు?
4. వాక్కుకు అధిష్టాన దేవత ఎవరు?
5. ఎవరి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి తల నరికాడు?
☛ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>


