News February 15, 2025
కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 12, 2025
జనవరి 23 నుంచి విశాఖలో బీచ్ ఫెస్టివల్

జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిపి విశాఖ ఉత్సవ్‌పై కమిటీ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తామన్నారు.
News December 12, 2025
నిర్మల్: రెండో విడత ఎన్నికలు జరిగే జీపీలు ఇవే

నిర్మల్ జిల్లాలో ఈనెల 14 ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని నిర్మల్ రూరల్‌లో20, సారంగాపూర్ 32, సోన్ 14, దిలావర్పూర్ 12, నర్సాపూర్ జి 13, లోకేశ్వరం 25, కుంటాల 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
News December 12, 2025
రెండో విడత ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి పీఓలకు తమ ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు.


