News February 15, 2025
కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News April 10, 2026
ఇద్దరు కార్పొరేటర్లపై ఎన్నికల పిటిషన్లు.. నోటీసులు జారీ

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు అఫిడవిట్ సరిగా ఇవ్వలేదని, అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 47, 54వ డివిజన్ నుంచి గెలుపొందిన వారి ఎన్నికలను రద్దు చేయాలని ప్రత్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణకు స్వీకరిస్తూ సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.
News April 10, 2026
ప.గో: జనసేన జడ్పీటీసీపై అత్యాచార కేసు నమోదు

వీరవాసరం జడ్పీటీసీ గూండా జయప్రకాశ్ నాయుడుపై భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదుతో ఆయనపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్, దాడి తదితర నాలుగు కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. నిందితుడిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
News April 10, 2026
భద్రాద్రిలో వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజలు చేసిన అనంతరం, బేడా మండపంలో సీతారాములకు వేద మంత్రాల మధ్య కళ్యాణ తంతు పూర్తి చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.


