News February 15, 2025

కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News April 10, 2026

జనగామ: ‘మొబైల్ నంబర్ సవరణకు ప్రత్యేక కార్యక్రమం’

image

ప్రభుత్వ సూచనల మేరకు జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఎరువుల బుకింగ్ యాప్ సేవలను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గ్రామాల వారీగా AEOల ద్వారా మొబైల్ నంబర్ సవరణకు షెడ్యూల్ రూపొందించారు. రైతులు తమ పాత నంబర్ పనిచేయకపోతే, క్లస్టర్ AEOను సంప్రదించి కొత్త నంబర్ నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దీంతో ఎరువుల బుకింగ్, సరఫరా వివరాలు సమయానికి అందుతాయన్నారు.

News April 10, 2026

ఇరాన్‌ కొత్త నాయకత్వం ఇంకా డేంజర్: IDF

image

ఇరాన్‌లో ఇప్పుడున్న నాయకత్వం మరింత ఎక్స్‌ట్రీమ్‌గా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) హెచ్చరించింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త లీడర్‌షిప్ సంప్రదాయ మత పెద్దల నుంచి కాకుండా IRGC నుంచి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రహస్య సమావేశంలో IDF ప్రతినిధులు పార్లమెంటు ఫారిన్ అఫైర్స్ కమిటీకి తెలియజేశారు. ఈ క్రమంలో యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కమిటీ చీఫ్ బోవజ్ బిస్ముత్ అభిప్రాయపడ్డారు.

News April 10, 2026

పాడేరులో పర్యటించిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్

image

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా.వర్ణాలి దేక అల్లూరి జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఐటీడీఏ పీవో శ్రీపూజతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై పీవో శ్రీపూజ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డైరెక్టర్ ముంతమామిడిలో బహుళ ప్రయోజక భవనం పరిశీలించారు.