News May 19, 2024
కరీంనగర్: ఎప్‌సెట్‌లో మెరిశారు
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (ఎప్‌సెట్) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. కరీంనగర్‌కు చెందిన మునీశ్వరి-చంద్రశేఖర్ రెడ్డిల కూతురు వి.హాసిని 144 ర్యాంకు, రజిని-శ్రీనివాస్‌ల కుమారుడు ఎన్. హేమంత్ 157వ ర్యాంకు, గంగాధరకు చెందిన ధనలక్ష్మి-పవన్‌ల కూతురు బొడ్ల ఆశ్రిత 220 ర్యాంకు సాధించారు. ఉన్నత విద్య అభ్యసించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2024
బంగారం అపహరించిన దొంగలను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు
బంగారం అపహరించిన దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ బుధవారం కరీంనగర్‌లో పెళ్లి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో 10 తులాల బంగారు ఆభరణాల కలిగిన బ్యాగును పొగొట్టుకుంది. KNR పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకొని బాధితురాలికి బంగారాన్ని అందజేశారు. ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్, క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్‌లను సిపి అభినందించారు.
News December 13, 2024
కరీంనగర్‌లో పోలీస్ సిబ్బందిని అభినందించిన సీపీ అభిషేక్ మహంతి
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సిబ్బందిని శుక్రవారం సీపీ అభిషేక్ మహంతి అభినందించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ ఆభరణాలను గుర్తించి పట్టుకుని, బాధితురాలికి అందించిన ఘటనలో కృషి చేసిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, అతని సిబ్బంది అయిన క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్‌లను సిపి అభిషేక్ మహంతి ప్రత్యేకంగా అభినందించి ప్రశాంస పత్రాలు అందజేశారు.
News December 13, 2024
మల్యాల: వ్యక్తి సజీవ దహనం.. UPDATE
షార్ట్ సర్క్యూట్‌తో నిన్న మల్యాల మండలంలో వ్యక్తి <<14855286>>సజీవ <<>>దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మ్యాడంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి(40) ట్రాక్టర్ డ్రైవర్, భార్య సౌందర్య హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే తిరుపతి మంటలకు ఆహుతి అయ్యాడు.