News February 8, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ డీఎస్పీ

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ డీఎస్పీ మధనం గంగాధర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గీతా భవన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కలెక్టర్ పమేల సత్పత్తికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంబేడ్కర్ ఆశయసాధనే తన లక్ష్యమని గంగాధర్ తెలిపారు.

Similar News

News February 8, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఆసిఫాబాద్ జిల్లాలో బీజేపీ నాయకుల సంబరాలు*కావేటి సమ్మయ్యను గుర్తు చేసుకున్న KTR* వాంకిడిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి* రెబ్బెన: జాతరకు పటిష్ఠ భద్రత:SP* ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలి: JAC

News February 8, 2025

పెంబి: పురుగుమందు తాగి వివాహిత మృతి

image

పురుగు మందు తాగి వివాహిత మృతి చెందిన ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన మాలావత్ సానుక(22)ను ఆమె భర్త ఈనెల 3న మొక్కజొన్న పంటకు నీళ్లు పారీయమని చెప్పగా ఆమె క్షణికావేశానికి లోనై పురుగుల మందు తాగిందన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 8, 2025

లిక్కర్ స్కామ్‌లో భాగమైన మూడు పార్టీలు బలి!

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధమున్న మూడు పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్‌లు ఓటమి చవిచూశాయి. లిక్కర్ స్కామ్‌లో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీరందరూ ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు.

error: Content is protected !!