News February 8, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ డీఎస్పీ

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ డీఎస్పీ మధనం గంగాధర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గీతా భవన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కలెక్టర్ పమేల సత్పత్తికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంబేడ్కర్ ఆశయసాధనే తన లక్ష్యమని గంగాధర్ తెలిపారు.

Similar News

News October 30, 2025

JIO యూజర్లకు ₹35,100 విలువైన గూగుల్ AI సేవలు ఫ్రీ!

image

JIO & GOOGLE భాగస్వామ్యంతో జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా (₹35,100 విలువైన) గూగుల్ AI Pro సేవలు లభించనున్నాయి. ఈ ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. ఈ సేవలను తొలుత 18-25 ఏళ్ల Jio 5G యూజర్లకు అందించి.. ఆ తర్వాత అందరికీ విస్తరించనున్నారు. ‘AI సేవలను ప్రతి భారతీయుడికి అందించడమే లక్ష్యం’ అని ఇరు సంస్థలు తెలిపాయి.

News October 30, 2025

ANU: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం పరిధిలో జులై, ఆగస్టులో నిర్వహించిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12లోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు అందించాలని సూచించారు.

News October 30, 2025

ALERT.. పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇవాళ 6.30pmకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుండగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.