News February 8, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ డీఎస్పీ

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ డీఎస్పీ మధనం గంగాధర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గీతా భవన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కలెక్టర్ పమేల సత్పత్తికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంబేడ్కర్ ఆశయసాధనే తన లక్ష్యమని గంగాధర్ తెలిపారు.

Similar News

News March 24, 2025

VZM: ఈ నెల 25,26 తేదీల్లో APPSC ప‌రీక్ష‌లు

image

ఈ నెల 25,26 తేదీల్లో జ‌ర‌గ‌నున్న APPSC ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని DRO ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజ‌నీర్‌, 25, 26 తేదీల్లో పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులోని అన‌లిస్ట్ గ్రేడ్‌-2 ఉద్యోగాల‌కు, 26న డిప్యుటీ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.

News March 24, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు 90.94% హాజరు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి ఎం.రమేష్ తెలిపారు. మొత్తం 41 సెంటర్లలో బాలురు 2,975, బాలికలు 3,231కు మొత్తం 6,206 గాను… బాలురు 2,973, బాలికలు 3,229 హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 90.94% హాజరయ్యారు.

News March 24, 2025

క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: రాహుల్ శర్మ

image

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మూలించగలమన్నారు. సంక్రమిత వ్యాధుల్లో క్షయ ఒకటని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను హరించేస్తుందని తెలిపారు.

error: Content is protected !!