News February 14, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకుల నియామకం

MDK-NZB -KNR-ADB పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిశీలకులు సంజయ్ కుమార్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిశీలకులు మహేశ్ దత్ 7993744287లను సంప్రదించాలన్నారు.
Similar News
News September 15, 2025
‘గ్రామపాలనాధికారులు మెరుగైన సేవలు అందించాలి’

ఖమ్మం: గ్రామపాలనాధికారులు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్ ఇచ్చామన్నారు.
News September 15, 2025
ఆరోగ్య మహిళ.. శక్తివంతమైన కుటుంబం: మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లాలో ‘ఆరోగ్య మహిళ.. శక్తివంతమైన కుటుంబం’ కార్యక్రమాన్ని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆయన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రాథమిక, అర్బన్, బస్తీ దవాఖానాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
News September 15, 2025
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.