News February 25, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఉమ్మడి KNR, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి?
Similar News
News February 25, 2025
ఏపీ అసెంబ్లీ వాయిదా

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ తర్వాత ఫిబ్రవరి 28కి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
News February 25, 2025
భారీ భద్రతలతో పోలింగ్: కలెక్టర్

భారీ భద్రతలతో ఎమ్మెల్సీ ఎన్నిలక పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 37 మంది ఎస్సైలు, 69 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 221 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర భధ్రతా సిబ్బందితో కలిసి 477 మందిని పోలింగ్ ప్రక్రియకు వినియోగించనున్నట్లు తెలిపారు. 70 మంది జోనల్ అధికారులను, 99 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.
News February 25, 2025
మాదిగ అమరవీరుల కుటుంబాల కాళ్లు కడిగిన మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరుగుతున్న మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయన్నారు. హక్కుల సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఈరోజు నివాళులర్పిస్తున్నామన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగారు. ఈ సందర్భంగా వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.