News March 5, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ కౌంటింగ్.. 23 మంది ఎలిమినేట్

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అధికారులు చేయనున్నారు. లెక్కింపునకు ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికి 23 స్వతంత్ర అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Similar News
News December 7, 2025
బోథ్: ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావద్దు: ఎస్పీ

రానున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం రాత్రి బోథ్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ఆయన ప్రజలతో మాట్లాడారు. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటుపై ఉండకూడదని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 7, 2025
‘EU’ని రద్దు చేయాలి: ఎలాన్ మస్క్

యూరోపియన్ కమిషన్ ‘X’కు 140 మిలియన్ డాలర్ల <<18483215>>ఫైన్<<>> విధించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘యూరోపియన్ యూనియన్ను రద్దు చేయాలి. సార్వభౌమాధికారాన్ని దేశాలకు తిరిగి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వాలు తమ ప్రజలకు బాగా ప్రాతినిధ్యం వహించగలుగుతాయి’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ను ఓ యూజర్ షేర్ చేయగా.. ‘నా ఉద్దేశం అదే.. నేను తమాషా చేయట్లేదు’ అని పునరుద్ఘాటించారు.
News December 7, 2025
డిసెంబర్ 07: చరిత్రలో ఈ రోజు

1792: భారత్లో పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ
1896: తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
1975: డైరెక్టర్ సురేందర్ రెడ్డి జననం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(ఫొటోలో) మరణం
*భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
*అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం


