News August 30, 2024
కరీంనగర్: ఏజెంట్ల మోసాలు.. గల్ఫ్‌లో కష్టాలు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్‌కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కంపెనీ నిబంధనలు పాటించకుండా చాలా మంది చిక్కుల్లో పడుతున్నారు. మరోవైపు నకిలీ ఏజెంట్లతో చాలా మంది మోసపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు నకిలీ ఏజెంట్ల బారిన పడవద్దని, మోసం జరిగితే ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్ కలిగి ఉన్నారు.
Similar News
News October 15, 2025
ఆర్డీవో నివేదిక జాప్యంపై కరీంనగర్ కలెక్టర్‌కు ఫిర్యాదు

135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణిలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడని వీఆర్ఏపై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్డిఓను 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్డీఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12న విచారణ పూర్తి చేసిన తుది నివేదిక అందించలేదని వాపోయాడు.
News October 15, 2025
KNR: నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమం

స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి అధ్యక్షతన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డా.మొగిలి, డా.లక్ష్మణరావు, పెద్ది స్వరూప, డా.స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
News October 15, 2025
KNR: బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కరీంనగర్ హెల్త్ క్లబ్, రెడ్డీస్ లాబరేటరీ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డా.డి.వరలక్ష్మి అధ్యక్షతన, డాక్టర్ ఎం. ప్రతిష్ఠ రావు Reproduction concern Grenz, మహిళలలో వచ్చే Breast Cancer, PCDD పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ కో ఆర్డినేటర్ డా. నజియా, జె.రజిత, డి.స్వరూప రాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.