News March 3, 2025

కరీంనగర్: ఓపెన్ చేసిన స్ర్టాంగ్ రూమ్ సీల్

image

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో భాగంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు బయటకి తీసుకు వచ్చారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేశారు.

Similar News

News November 27, 2025

ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

image

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 22 ఫ్లయింగ్ స్క్వాడ్, 6 స్టాటిక్ సర్వేలయన్స్, 6 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను, 4 అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.

News November 27, 2025

మంచిర్యాల జిల్లాలో 25 నామినేషన్లు దాఖలు

image

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు గురువారం మంచిర్యాల జిల్లాలో 90 సర్పంచ్ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. 816 వార్డులకు గాను 14 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. మరో రెండు రోజులు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా.. ఈ నెల 30న పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.

News November 27, 2025

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 26 నామినేషన్లు

image

మొదటి రోజు నిర్మల్ జిల్లాలో మొత్తం 26 నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. దస్తురాబాద్‌ 3, కడెం (పెద్దూర్‌) 9, ఖానాపూర్‌ 7, మామడ 6, లక్ష్మణచాందా 1 నామినేషన్లు దాఖలయ్యాయి. పెంబిలో నామినేషన్ దాఖలు కాలేదన్నారు. నామినేషన్ల స్వీకరణ 29 వరకు కొనసాగుతుందని వివరించారు.