News May 10, 2024
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: సీపీ

మే 11న సాయంత్రం 06 నుంచి మే 13న పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతా సహకరించాలని కోరారు.
Similar News
News February 11, 2025
కరీంనగర్: చింతచెట్టు పైనుంచి పడి రైతు మృతి

జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన రైతు చెంచల సంపత్ (35) మంగళవారం చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందినట్లుగా గ్రామస్థులు తెలిపారు. మృతుడు సంపత్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల గ్రామస్థులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
సైదాపూర్: ఎవరి లెక్క ఏంటో తేలాలని రాహుల్ అప్పుడే అన్నారు: మంత్రి పోన్నం

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరి లెక్క ఏంటో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనే స్పష్టం చేశారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ దొందు దొందే, రాంగ్ డైరెక్షన్‌లో పోయేలాగా ఈ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నారు.
News February 11, 2025
పెద్దపల్లి: ఇద్దరు మేకల దొంగల అరెస్ట్

కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలు దొంగతనం చేసిన చొప్పదండికి చెందిన మనుపతి సంజీవ్‌కుమార్, కమాన్‌పూర్ మండలం పెంచకల్‌పేటకు చెందిన శివరాత్రి రమేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 2న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన టీ.కొమురయ్య 3, మల్యాలకు చెందిన బీ.రాజయ్య 2 మేకలను దొంగతనం చేశారని ఎస్‌ఐ తెలిపారు.