News July 20, 2024

కరీంనగర్: ‘కష్టపడి పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయండి’

image

కష్టపడి పని చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయండని, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూసి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సిపి, ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.

Similar News

News December 2, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతి లలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.

జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

image

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.