News April 25, 2024
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావును ఆ పార్టీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. ఆయన తండ్రి జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్ రావు గతంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కొంతకాలం ప్రజారాజ్యం, బీఆర్ఎస్‌లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. కాగా రాజేందర్ రావు ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు.
Similar News
News January 10, 2025
KNR: వసతి గృహాలను అధికారులు ప్రతినిత్యం పరిశీలించాలి: కలెక్టర్
ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు నిత్యం క్షేత్రస్థాయి సందర్శించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంఈవోలు కూడా హాస్టల్లో భోజనాల తయారీ తీరును పరిశీలించాలన్నారు. నూతన కామన్ మెనూ అమలు కోసం ఇంకా ఏమైనా వంట పాత్రలు వంటివి కావాలంటే అందిస్తామని తెలిపారు. హాస్టల్లో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
News January 9, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ రేపటినుండి కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు. @ జగిత్యాల జిల్లాలో బిజెపి మండల నూతన అధ్యక్షుల నియామకం. @ పెగడపల్లి మండలంలో మెగా పశువైద్య శిబిరం. @ మల్లాపూర్ మండలంలో బావిలో పడి బాలుడి మృతి. @ కోరుట్ల మండలంలో సంపులో పడి యువకుడి మృతి. @ మానకొండూరు మండలంలో లారీ ఢీకొని యువకుడి మృతి. @ బాలుడికి ఆర్థిక సహాయం అందించిన సిరిసిల్ల కలెక్టర్.
News January 9, 2025
సిరిసిల్ల: ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ
సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పండుగకి ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్‌స్టేషన్లో లేదా గ్రామ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.