News November 16, 2024

కరీంనగర్: కాంగ్రెస్ టికెట్ ఎవరికో?

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిల పేర్లను అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలున్నాయి.

Similar News

News December 12, 2024

ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

image

తెలంగాణాను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. కృత్రిమ మేధ, జీవశాస్త్రాలు, టెక్నాలజీ రంగాల్లో దిగ్గజ సంస్థలను ఆకర్షించడం ద్వారా ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నిలిచిందని ఆయన తెలిపారు.

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ప్రధానాంశాలు

image

☞ పంచాయతీ అవార్డు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్
☞ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న సీఎం క్రికెట్ కప్
☞ గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కరీంనగర్ కలెక్టర్
☞ హుస్నాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతలు
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతా జయంతి వేడుకలు
☞ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
☞ ఎల్కతుర్తి: పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

News December 11, 2024

KNR: గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు.