News April 1, 2024

కరీంనగర్: కాంగ్రెస్ MP టికెట్ ఎవరికీ?

image

కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం రోజుకొక పేరుతో చర్చలో నిలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఇద్దరు సీనియర్ లీడర్లే మరి కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Similar News

News April 22, 2025

కొత్తపల్లి చెరువులో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

image

కరీంనగర్ కొత్తపల్లి హవేలీ చెరువులో యువకుడి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి భార్గవ్‌గా పోలీసులు గుర్తించారు. భార్గవ్ తల్లిదండ్రులు కొత్తపల్లికి చెందిన పబ్బోజు నాగరాజు యాదలక్ష్మి కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో కొత్తపెళ్లి చెరువు వద్ద మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

News April 22, 2025

కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఎండ..

image

కరీంనగర్ జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.5°C నమోదు కాగా, జమ్మికుంట 43.4, గంగాధర 43.2, తిమ్మాపూర్ 43.0, కరీంనగర్ 42.8, గన్నేరువరం 42.7, వీణవంక, కరీంనగర్ రూరల్ 42.6, రామడుగు, చిగురుమామిడి 42.5, హుజూరాబాద్, కొత్తపల్లి 42.4, ఇల్లందకుంట 42.3, శంకరపట్నం 42.2, చొప్పదండి 41.5, సైదాపూర్ 40.1°C గా నమోదైంది.

News April 22, 2025

కరీంనగర్: తేలనున్న 35,562 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. KNR జిల్లాలో మొత్తం 35,562 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,799 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

error: Content is protected !!