News August 20, 2024

కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌‌

image

కరీంనగర్ కార్పొరేషన్‌ కొత్త కమిషనర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌‌ని నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన చాహత్‌ బాజ్‌పాయ్‌‌ ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా, ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తించారు.

Similar News

News December 9, 2025

చొప్పదండి: నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

image

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఈనెల 13న జరగనున్న దృష్ట్యా, నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై విధి విధానాలు చర్చించి, సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓ మోహన్ పాల్గొన్నారు

News December 8, 2025

కరీంనగర్ డీఈఓగా అదనపు కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాంక్డేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఈ నవీన్ నికోలావీస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఈఓగా ఉన్న శ్రీరామ్ మొండయ్య ఇకపై డైట్ ప్రిన్సిపాల్‌గా కొనసాగనున్నారు. పలువురు డీఈఓ పదవికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

News December 8, 2025

KNR: స్విమ్మింగ్‌లో బ్రాంజ్ మెడల్‌తో మెరిసిన స్వరణ్

image

ఆదిలాబాద్ వేదికగా జరుగుతున్న సౌత్ జోన్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్విమ్మర్ కంకణాల స్వరణ్ సత్తా చాటాడు. గ్రూప్-1 కేటగిరీలో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు. స్వరణ్‌ను క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్, స్విమ్మింగ్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణమూర్తితో పాటు కోచ్‌లు ఘనంగా అభినందించారు.