News August 20, 2024
కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్
కరీంనగర్ కార్పొరేషన్ కొత్త కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్‌ని నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన చాహత్ బాజ్‌పాయ్ ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా, ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తించారు.
Similar News
News September 13, 2024
కరీంనగర్: పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్
గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులకు, పోలీసులకు అన్నివిధాలుగా సహకరించాలని కోరారు.
News September 13, 2024
నంది మేడారం: డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: ప్రభుత్వ విప్
పెద్దపల్లి జిల్లాలో ఈనెల 14న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ధర్మారం మండలం నంది మేడారం పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News September 13, 2024
CM రేవంత్ రెడ్డిని కలిసిన రామగుండం MLA
రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు HYDలోని CM రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల రామగుండంలో 1,800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో CMకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రామగుండం మెడికల్ కాలేజీలో అదనంగా నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి CM సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.