News January 27, 2025

కరీంనగర్: కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతి

image

కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ఈ నెల 28తో ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతిని నియమించింది. ఆదివారం జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఆ మూడు మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్‌ని నియమించింది.

Similar News

News February 8, 2025

చొప్పదండి: ప్రశాంతం నవోదయ ప్రవేశ పరీక్ష

image

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 9వ, 11వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. 1823 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 795 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు సహకరించిన కలెక్టర్ పమేలా సత్పతి, డీఈవో జనార్దన్ రావులకు ప్రిన్సిపల్ మంగతాయారు కృతజ్ఞతలు తెలిపారు.

News February 8, 2025

KNR: రేషన్ కార్డు దరఖాస్తులు.. అయోమయంలో ప్రజలు!

image

కొత్త రేషన్ కార్డుల కోసం, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు మీ సేవలో శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రజా పాలన గ్రామసభలు దరఖాస్తులు ఇచ్చిన లబ్ధిదారులు మళ్లీ మీ సేవలో దరఖాస్తులు ఇవ్వాలా? లేదా? అనే అయోమయంలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

News February 8, 2025

ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.

error: Content is protected !!