News April 10, 2025

కరీంనగర్: కూతురిని చంపి తల్లి సూసైడ్

image

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 24, 2026

రైల్వేలో 22,195 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

రైల్వేలో 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ఇప్పటివరకు అప్లై చేసుకోకపోతే మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.18వేలు చెల్లిస్తారు. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News February 24, 2026

తెలుగు సాహిత్యంలో మొలతాడు ప్రాధాన్యం

image

తెలుగు సాహిత్యంలో మొలతాడు ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద, శ్రీనాథుని శృంగార నైషధం గ్రంథాల్లో దీని ప్రస్తావన కనిపిస్తుంది. రామదాసు కీర్తనల్లో శత్రుఘ్నునికి పదివేల మొహరీల బంగారు మొలతాడు చేయించినట్లు పేర్కొన్నారు. బాలకృష్ణుడి అలంకరణలో తాయెత్తులు, మొలతాడు ప్రధానమైనవి. పుట్టిన 11వ రోజే ముంజ గడ్డి, లోహపు తాడుతో దీనిని కట్టడం రక్షణ కవచంలా భావిస్తారు. ఇది రాహు దోష నివారణకు కూడా సంకేతం.

News February 24, 2026

పార్వతీపురం: ఈ నంబర్‌కు HI అని మెసేజ్ చేస్తే చాలు

image

వాట్సాప్ మన మిత్ర ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు స్టడీ సెంటర్ ద్వారా పొందవచ్చునని వెల్లడించారు. అందుబాటులో లేనివారు 9532900009 నంబర్‌కు HI అని మెసేజ్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చుని ఆయన తెలిపారు.