News April 10, 2025

కరీంనగర్: కూతురిని చంపి తల్లి సూసైడ్

image

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 3, 2026

దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు

image

భారతదేశంలోని ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రీబాయి ఫూలే ఒకరు. ఆమె దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు. 1831, జనవరి 3న జన్మించిన ఆమె 1848లో పుణేలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. దీంతో అగ్రవర్ణాలవారు పాఠశాలకు వెళ్లేప్పుడు ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలంతో దూషించడం చేసేవారు. ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని సావిత్రీబాయి మహిళా సాధికారత కోసం పాటుపడ్డారు.

News January 3, 2026

రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

<>రాష్ట్రీయ<<>> రక్ష యూనివర్సిటీ 5 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, NET/SLET/SET, PhD/M.Phil ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.92,239, Jr.ROకు రూ.40,000-44,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rru.ac.in

News January 3, 2026

HYDలో హై రైజ్‌ బిల్డింగ్స్ అదరహో..!

image

HYD నగరంలో గ్రేటర్ వ్యాప్తంగా హై రైజ్ భవనాలు వేగంగా పెరుగుతున్నాయి. 2024లో 69 హై రైజ్ భవనాలకు అనుమతులు మంజూరు కాగా, 2025లో 103 హై రైజ్‌ భవనాల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల పరంగా 2024లో 11,855 భవనాలకు, 2025లో 11,166 భవనాలకు అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు.