News September 13, 2024
కరీంనగర్: కూరగాయలకు భారీగా పెరిగిన ధరలు
మొన్నటి వరకు శ్రావణమాసం, ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో కూరగాయల రేట్లు భారీగానే పెరిగాయి. బెండకాయ కిలో రూ.60-70, సొరకాయ రూ.60, పచ్చిమిర్చి రూ.80, కొత్తిమీర ఏకంగా కిలో రూ.200 వరకు పలుకుతోంది. ఏ కూరగాయల ధరలు చూసినా మండిపోతున్నాయి. వర్షాల కారణంగా కూరగాయలు రావట్లేదని వ్యాపారస్థులు చెబుతున్నారు.
Similar News
News October 15, 2024
జగిత్యాల: అర్దరాత్రి దారుణ హత్య
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలో యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికుల ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్(33) అనే యువకుడిపై సోమవారం అర్దరాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ సురేశ్ బాబు, ఎస్సై శ్రీకాంత్ చేరుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 15, 2024
KNR: మంత్రగాళ్లు జాగ్రత్త.. కట్లకుంటలో వెలిసిన పోస్టర్
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. గ్రామ కూడలిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు. తమ సంస్థకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఒక్కొక్కరిని చంపబోతున్నామని, ముందుగా గచ్చునూతి వద్ద గల ఇద్దరితో మొదలుపెట్టి ఇతర వీధుల్లో ఉన్నవారిని హతమార్చుతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
News October 14, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,23,033 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.67,998, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.40,890, అన్నదానం రూ.14,145 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.