News February 16, 2025

కరీంనగర్: ‘కేసీఆర్‌కు పట్టిన గతే సీఎంకు పడుతుంది’

image

ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే మాజీ సీఎంలు కేసీఆర్‌, కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Similar News

News October 23, 2025

ప్రద్యుమ్న ఫిర్యాదుపై మాగంటి సునీత ఏమన్నారంటే?

image

TG: ఈసీకి ప్రద్యుమ్న <<18073070>>ఫిర్యాదు<<>> చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు. ఆయన ఆరోపణలు తప్పని తేల్చిచెప్పారు. తనపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు నవీన్ యాదవ్ నామినేషన్‌లో కొన్ని ఖాళీలు ఉండటంపై ఫిర్యాదు చేసినట్లు BRS నేతలు వెల్లడించారు. చట్టప్రకారం పత్రాలలో ఎలాంటి ఖాళీలు ఉండకూడదని పేర్కొన్నారు.

News October 23, 2025

VKB:”తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్

image

“తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. 2047లో రాష్ట్రం ఎలా ఉండాలనే దిశగా ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిందని తెలిపారు. ప్రజలు తమ విలువైన సూచనలు, సలహాలను www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్ ద్వారా అందించవచ్చని కలెక్టర్ సూచించారు.

News October 23, 2025

ఇండియన్ ఆర్మీకి ‘భైరవ్’

image

భారత సైన్యానికి మరింత బలం చేకూరనుంది. అత్యాధునిక టెక్నాలజీ, శక్తిమంతమైన ఆయుధాలతో స్పందిస్తూ రిస్కీ ఆపరేషన్లు చేసే ‘భైరవ్’ బెటాలియన్ సిద్ధమైతున్నట్లు ఆర్మీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ తెలిపారు. నవంబర్ 1న తొలి బెటాలియన్ సైన్యంలో చేరనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో 25 బెటాలియన్లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ భైరవ్ యూనిట్‌లో 250 మంది సైనికులు, 7-8 మంది అధికారులు ఉంటారు.