News February 17, 2025
కరీంనగర్: కేసీఆర్కు బండి సంజయ్ బర్త్ డే విషెస్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ X (ట్విటర్) వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
Similar News
News October 24, 2025
ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

నవంబర్ 1 నుంచి 7 వరకు జరగనున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం రేగళ్ల, చాతకొండ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఎన్హెచ్ఎం బృందం రానున్నందున ముందస్తు ఏర్పాట్లను, కేంద్రాల స్థితిగతులను పరిశీలించారు. ప్రజలకు సకాలంలో, సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News October 24, 2025
విజయనగరంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం

SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 15 మంది యువతకు 45 రోజుల ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నేడు ప్రారంభమైంది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శిక్షణా బస్సుకు JC సేతు మాధవన్ జెండా ఊపి ప్రారంభించారు. వీటి అగ్రహారం RTC శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో SC కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
News October 24, 2025
స్కూల్ పైనుంచి పడిన విద్యార్థిని పరిస్థితి విషమం

తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరుపాడులోని మాగంటి అన్నపూర్ణా దేవి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కొమ్ము హాసిని బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని తండ్రి రవికుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.


