News August 18, 2024

కరీంనగర్: కొడుకు బారసాల చూడకుండానే తండ్రి సూసైడ్

image

కుమారుడి బారసాల చూడకుండానే తండ్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. శంకరపట్నం మండలం ముత్తారానికి చెందిన నాగిని వినోద్‌కుమార్‌ (34)కు నాలుగేళ్ల క్రితం పచ్చునూర్‌కు చెందిన లిఖితతో వివాహం జరిగింది. వీరికి ఇటీవల కుమారుడు జన్మించాడు. మరో 4 రోజుల్లో బారసాల ఉండగా.. తన మామయ్య సమ్మయ్య పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

Similar News

News September 15, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస మూలమలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్తున్న ట్రావెల్ బస్సు, వెల్గొండ నుంచి జగిత్యాల వైపు వస్తోన్న స్కూటీ, బైకును ఢీకొంది. దీంతో అల్లీపూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తప్పని నిరీక్షణ!

image

కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తోందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

News September 15, 2024

ఉమ్మడి KNR జిల్లాలో పాఠశాలల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఈ విధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 784 పాఠశాలల్లో 98,240 విద్యార్థులు, కరీంనగర్ జిల్లాలో 1,071 పాఠశాలల్లో 1,57,648 విద్యార్థులు, జగిత్యాల జిల్లాలో 1,165 పాఠశాలల్లో 1,59,585 విద్యార్థులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 659 పాఠశాలల్లో 87,390 విద్యార్థులు ఉన్నారు.