News November 1, 2024

కరీంనగర్: కొనుగోళ్ల ప్రారంభం ఎప్పుడో?

image

కరీంనగర్ జిల్లాలో గత నెల రోజుల క్రితం వరి కోతలు మొదలయ్యాయి. అయితే కొనుగోళ్లు ప్రారంభం కాక.. కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఓ వైపు మబ్బులు కమ్ముకోవడంతో చేసేదేం లేక దళారులకు అమ్ముకుంటున్నారు. క్వింటాలుకు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. కాగా, ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.

Similar News

News November 1, 2024

కథలాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డిఎస్పీ

image

కథలాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను మెట్‌పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా.. డిఎస్పీ ఉమామహేశ్వరరావు స్టేషన్‌లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నెలల వారీగా నమోదైన కేసులు, వాటి పరిష్కారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కోరుట్ల సీఐ సురేష్‌బాబు, ఎస్ఐ నవీన్ కుమార్ ఉన్నారు.

News November 1, 2024

పెద్దపల్లి: నేడు దీపావళి వేడుకలు

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు గురువారం ఘనంగా జరగగా.. పలుచోట్ల నేడు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో PDPL జిల్లాలోని పలు చోట్ల వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి కేదారేశ్వర నోమును పవిత్రంగా నోముకుంటారు. స్వాతి నక్షత్రం రావడంతో పెద్ద ఎత్తున నోములు నోముకుంటున్నారు. మరి దీపావళిని మీరు ఎలా జరుపుకున్నారు?

News November 1, 2024

KNR: డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్య

image

డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI కృష్ణారెడ్డి వివరాలు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సోము శంకర్(33) పీజీ వరకు చదువుకున్నాడు. ఇటీవల DSC రాయగా ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.