News March 23, 2025
కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
Similar News
News April 18, 2025
కేసీఆర్ సెంటిమెంట్.. ఉమ్మడి KNRలో BRS సభ

KCRకు సెంటిమెంట్ జిల్లా అయిన ఉమ్మడి KNR(ఎల్కతుర్తి)లో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. TRSని పెడుతున్నట్లు మొదటిసారిగా KNR గడ్డపైనే KCR ప్రకటించారు. రైతుబంధు, దళితబంధు పథకాలను కూడా ఈ జిల్లాలోనే ప్రారంభించారు. అధికారం కొల్పోయిన తర్వాత ఉమ్మడి KNR(ఎల్కతుర్తి)లో BRS మొదటిసారిగా భారీఎత్తున సభ పెడుతున్నందున ఆసక్తి నెలకొంది.
News April 18, 2025
కరీంనగర్: లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ నియమాకం

లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ నియమాకం చేస్తూ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి K.వెంకటేష్ ఉత్తర్వులు జారీచేశారు. డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా T.మహేష్, అసిస్టెంట్ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా K.మౌనిక నియమితులయ్యారు. ఆర్థిక స్థోమత లేని నిందితులకు వీరు ఉచిత న్యాయ సహాయం అందిస్తారు. లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అభినందించారు.
News April 18, 2025
కరీంనగర్: ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ 100% పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

కరీంనగర్ కలెక్టర్‌లో ఇందిరమ్మఇండ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసిన 15 గ్రామాలలో 2027 మందికి ఇల్లు మంజూరు చేసామని పేర్కొన్నారు. 730 ఇండ్లకు పూర్తయిందని,114 బేస్మెంట్ లెవల్‌కు చేరాయని తెలిపారు. రెండోదఫా ఇండ్లను గ్రామాలు, మున్సిపల్‌వార్డుల వారిగా మంజూరు చేసేందుకు అలాట్మెంట్ జాబితా తయారుచేయాలని అన్నారు.