News March 20, 2024
కరీంనగర్: గుండెపోటుతో ఏఎస్సై మృతి
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మార్కొండ కిషన్(59) బుధవారం జ్యోతినగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కిషన్ పోలీస్ శాఖలో సుధీర్ఘ కాలం పాటు సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో జరగనున్నాయి.
Similar News
News September 10, 2024
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. నగరంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుందని, బాధ్యత గల మంత్రిగా కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి పొన్నం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. నగరంలో 3 నెలల క్రితం తమకు సమాచారం లేకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం చేశారని, తమ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా కరీంనగర్లో సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.
News September 10, 2024
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డ్‌లను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎలాంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలన్నారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.
News September 10, 2024
కరీంనగర్: ఏరియా ఆసుపత్రులకు గుర్తింపు.. నిధులు కరవు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల ఎన్క్వాస్ అవార్డుకు ఎంపికయ్యాయి. ఇక్కడి వైద్యులు ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తుండడంతో పాటు చక్కటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తింపు లభించింది. అయితే మంచి సేవలు అందిస్తున్నప్పటికీ ఈ ఆసుపత్రులకు నిధులు మాత్రం కరవయ్యాయి.