News October 7, 2024

కరీంనగర్: గునుగు పూలకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

image

కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన గుంటుక కాళిదాసు ఆదివారం ఉదయం గునుగు పూలు తేవడానికి వెళ్లాడు. పూలను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు.

Similar News

News November 12, 2024

వేములవాడ : ఈనెల 13 నుంచి 15 వరకు అభిషేకాలు రద్దు

image

దక్షిణ కాశిగా పేరొందిన ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 13 నుంచి 15 అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నపూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయం భక్తులు గమనించి సహకరించగలరని కోరారు.

News November 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మారం మండలంలో విద్యుత్ షాక్ తో ఒకరికి తీవ్ర గాయాలు. @ శంకరపట్నం మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ సిరిసిల్ల కార్గిల్ లేఖలో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రేపు జగిత్యాలకు రానున్న మాజీ మంత్రి హరీష్ రావు. @ జగిత్యాల జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన కలెక్టర్. @ సిరిసిల్ల ప్రజావాణిలో 123 ఫిర్యాదులు.

News November 11, 2024

రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి పొన్నం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం రాత్రి 11:55గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్‌పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈరోజు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.