News March 6, 2025
కరీంనగర్: గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అంజిరెడ్డి

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. గెలిచిన BJP అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హాల్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
Similar News
News February 10, 2026
మార్కాపురం నుంచి శ్రీశైలానికి 80 RTC బస్సులు

శ్రీశైలం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్కాపురం డిపో RTC బస్సులు ఏర్పాట్లు చేసింది. మార్కాపురం నుంచి శ్రీశైలానికి సోమవారం నుంచి 18వతేదీ వరకు 80 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య సోమవారం తెలిపారు. 14, 15,16 తేదీల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఆ రోజుల్లో కూడా మరికొన్ని సర్వీసులు కూడా నడిపేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని DM చెప్పారు.
News February 10, 2026
జూన్ తర్వాత ఎల్‌నినో.. ‘నైరుతి’పై ప్రభావం!

దేశంలో జూన్ తర్వాత ఎల్‌నినో ఏర్పడేందుకు 50 శాతం ఛాన్స్ ఉందని స్కైమెట్ అంచనా వేసింది. సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో అవకాశం 70 శాతానికి చేరొచ్చని తెలిపింది. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. దీనివల్ల మన దేశంలో వర్షాలు తగ్గిపోతే దక్షిణ అమెరికాలో భారీ వర్షాలు కురుస్తాయి.
News February 10, 2026
లేబర్ కోడ్‌లపై పోరు.. ఎల్లుండి బంద్

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన <<18354721>>నాలుగు లేబర్ కోడ్‌లకు<<>> వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ నెల 12న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నాయి. AP, TG సహా అన్ని రాష్ట్రాల్లోని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఈ లేబర్ కోడ్‌లతో ESI, PF, గ్రాట్యుటీ, పింఛన్‌లకు కార్మికులు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ కోడ్‌లను రద్దు చేసి గతంలోని 29 చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.


