News June 27, 2024
కరీంనగర్: గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు

TGPSC గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 08, 09, రెండో టెస్ట్ జులై 15, 16, మూడో టెస్ట్ జులై 22, 23, నాలుగో టెస్ట్ జులై 30, 31వ తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News February 10, 2025
KNR: రేపు ముసాయిదా జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. KNR జిల్లాలో 15 ZPTCలు, 170 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
News February 10, 2025
మంథని: కోడలిపై మామ లైంగిక వేధింపులు..?

అత్తింటివారు వేధిస్తున్నారని మంథని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ యువతి నిరసన చేసింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన యువతికి పోచమ్మవాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ఆమె గర్భవతి కాగా మామ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గత నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పడంతో ఆదివారం నిరసన చేపట్టింది. కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ తెలిపారు.
News February 10, 2025
ధర్మారం: పెళ్లికి ప్రియురాలు నో.. యువకుడి సూసైడ్

ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన గడ్డం అజయ్(22) తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెంది గతనెల 29న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, చికిత్స పొందుతూ అజయ్ ఆదివారం మృతి చెందినట్లు ధర్మారం SI శీలంలక్ష్మణ్ తెలిపారు. అజయ్ తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.