News December 14, 2024
కరీంనగర్: గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్న ఈ పరీక్షలకు 26,977 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 56 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరిక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
Similar News
News December 27, 2024
వేములవాడ: గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
రాజన్న గోవులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్లోని గోశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి
భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.
News December 27, 2024
KNR: నేడు జరిగే సెమిస్టర్ పరీక్ష వాయిదా!
KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు. కాగా, నేటి పరీక్ష నిర్వహణ మళ్లీ ఎప్పుడు అనేది ప్రకటిస్తామన్నారు.