News November 18, 2024

కరీంనగర్: గ్రూప్ -3 పరీక్షకు 53.39% హాజరు

image

గ్రూప్ -3 పరీక్షకు ఆదివారం కరీంనగర్ జిల్లాలో మొత్తం 26,415 మంది అభ్యర్థులకు గాను పేపర్ -1లో 14,104 మంది హాజరు కాగా, 12,311 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 53.39% హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పేపర్ -2 లో భాగంగా 26,415 అభ్యర్థుల గాను 14,009 మంది హాజరు కాగా, 12,406 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 53.03% హాజరైనట్లు తెలిపారు.

Similar News

News November 18, 2024

జగిత్యాల: రైతు బిడ్డకు రెండు ప్రభుత్వ కొలువులు

image

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామానికి చెందిన కట్కూరి సాయి కిరణ్ రెడ్డి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన కట్కూరి సుధాకర్ రెడ్డి-అరుణ అనే రైతు దంపతుల కొడుకు సాయి కిరణ్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ -4 ఫలితాల్లో మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు.

News November 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతం. @ తిమ్మాపూర్ మండలంలో బావిలో పడి వ్యక్తి మృతి. @ బుగ్గారం మండలంలో బావిలో పడి యువకుడి మృతి. @ భీమదేవరపల్లి మండలంలో కారు, బైకు డీ.. రైతు మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాల మండలంలో కుమారుని పుట్టినరోజు సందర్భంగా దంపతుల రక్తదానం.

News November 17, 2024

రాజన్న కోవెలలో సామూహిక కార్తీక దీపోత్సవం

image

రాజన్న ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం సందర్భంగా వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాన అర్చకులు ఈశ్వరిగారి సురేశ్ ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు 2వ శనివారం నుంచి వచ్చే నెల 1 వరకు సామూహిక కార్తీక దీపోత్సవం చేస్తున్నారు. రేవతి, అనిత, సంకీర్తన బృందం వారిచే భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.