News November 18, 2024
కరీంనగర్: గ్రూప్ -3 పరీక్షకు 53.39% హాజరు
గ్రూప్ -3 పరీక్షకు ఆదివారం కరీంనగర్ జిల్లాలో మొత్తం 26,415 మంది అభ్యర్థులకు గాను పేపర్ -1లో 14,104 మంది హాజరు కాగా, 12,311 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 53.39% హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పేపర్ -2 లో భాగంగా 26,415 అభ్యర్థుల గాను 14,009 మంది హాజరు కాగా, 12,406 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 53.03% హాజరైనట్లు తెలిపారు.
Similar News
News December 3, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,94,988 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.87,154, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.79,950, అన్నదానం రూ.27,884,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
News December 2, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు. @ జగిత్యాల ప్రజావాణిలో 33 ఫిర్యాదులు. @ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రాలలో ట్రాన్స్ జెండర్ ల క్లినిక్‌లు ప్రారంభం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్‌పల్లి పట్టణంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ పెద్దపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష.
News December 2, 2024
రాజన్న ఆలయంలో మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు
వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మార్గశిర మాసం మొదటి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. చాలా మంది భక్తులు కొత్తగా పెళ్లయిన భక్తులు కోడలెక్కులు చెల్లించుకుంటూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఆలయం ముంగట గజ స్థంభ వద్ద అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.