News November 14, 2024
కరీంనగర్: గ్రూప్-3 ప్రశ్న పత్రాలకు కట్టుదిట్టమైన బందోబస్తు
గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్‌ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్లోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.
Similar News
News December 8, 2024
SUలో జాబ్‌మేళా.. 427 మందికి ఆఫర్ లెటర్స్
KNR శాతవాహన యూనివర్సిటీ లో నిన్న మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 2649 మంది అభ్యర్థులు రిజిస్టర్ కాగా 845 మంది షార్ట్ లిస్ట్ అయ్యి 427 మంది కంపెనీల వద్ద నుంచి ఆఫర్ లెటర్లను పొందారు. కాగా జాబ్‌మేళాలో ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులను నిర్వాహకులు, యూనివర్సిటీ అధికారులు అభినందించారు. ఈ మేళాను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
News December 8, 2024
జగిత్యాల: గుండెపోటుతో ఎంపీడీవో మృతి
జగిత్యాల జిల్లా బుగ్గారం MPDO గా విధులు నిర్వర్తిస్తున్న మాడిశెట్టి శ్రీనివాస్ శనివారం రాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఫిబ్రవరిలో జరిగిన బదిలీల్లో ఆయన బుగ్గారం ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. నిర్వహణలో నిన్న సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారులు, తన సిబ్బందితో గడిపిన ఆయన మృతి చెందడంతో వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్‌లో విషాదం నెలకొంది.
News December 8, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,93,193 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,082 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,280, అన్నదానం రూ.20,831, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ద్వారా ప్రజలకు తెలిపారు.