News February 1, 2025
కరీంనగర్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్
కరీంనగర్లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
Similar News
News February 1, 2025
పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టండి: కలెక్టర్
ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాఠశాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు పాఠశాలకు చేసే రాకపోకలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
News February 1, 2025
వరంగల్: ఆపరేషన్ స్మైల్ ద్వారా 161 చిన్నారులకు విముక్తి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా జనవరిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నారులకు విముక్తి కలిగించామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా తెలిపారు. వీరిలో 137 మంది బాలలు, 24 మంది బాలికలు ఉన్నారన్నారు. తనిఖీల్లో గుర్తించిన చిన్నారులను బాలల సంరక్షణ గృహానికి తరలించామని సీపీ తెలిపారు.
News February 1, 2025
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా RP ఠాకూర్
AP: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ RP ఠాకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ వేదికగా ఈయన పని చేయనున్నారు. RP ఠాకూర్ 2018 నుంచి 2019 వరకు ఏపీ డీజీపీగా పనిచేశారు. కొంత కాలం ఆర్టీసీ ఎండీగా కూడా సేవలందించారు.