News February 1, 2025

కరీంనగర్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

image

కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.

Similar News

News December 9, 2025

చిత్తూరు: హైవేల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

image

కుప్పం, కాణిపాకం జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం, హోసూర్, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే, కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్డు-NH 140 సంబంధించి కనెక్టివిటీ అంశాన్ని కేంద్రానికి సమర్పించగా ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

News December 9, 2025

ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

image

భద్రాద్రి జిల్లాలో మొదటి దశలో 8మండలాల్లో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295మంది సిబ్బంది నియమించామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఎస్ఈసీ రాణి కుముదినికి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేస్తూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News December 9, 2025

సిద్దిపేట: ఎన్నికల రోజు స్థానిక సెలవు: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 11న జరగనున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ హైమావతి సెలవు ప్రకటించారు. గజ్వేల్, మర్కుక్, వర్గల్, జగదేవపూర్, ములుగు, దౌలతాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు. ప్రజలంతా ఓటు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.