News February 19, 2025
కరీంనగర్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో యాసంగి పంటకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో విద్యుత్, మున్సిపల్, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేసవిలో నగరంతో పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 22, 2025
చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు

చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. జూనియర్లపై దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలుంటాయని స్కూల్ డైరెక్టర్ కేసీ రావు తెలిపారు. విషయాన్ని గోరంతను కొండంతలు చేశారని, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న స్కూల్‌ను బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులు ఎన్నో మెడల్స్ సాధించారని తెలిపారు.
News February 22, 2025
కరీంనగర్: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు KNRలోని రేకుర్తి గ్రామానికి చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
News February 22, 2025
KNR: ‘ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్స్ 100% పూర్తి చేయాలి’

ప్రాపర్టి టాక్స్ కలెక్షన్ 100 శాతం టార్గెట్ ను పూర్తి చేయాలని కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో శుక్రవారం డివిజన్ల వారిగా నియమించిన వార్డు ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆస్తిపన్నుల వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ లు వాటి పన్నులు, నగరపాలక సంస్థ దుకాణాల రెంటులు, మెండి బకాయి దారులు, అసెస్మెంట్ తదితర అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.