News March 21, 2024
కరీంనగర్: చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు!
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కమిషనరేట్‌లో 63 కేసులు నమోదు చేసి రూ.4.25 కోట్లు పట్టుకున్నారు. ఈ నెల 16న ప్రతిమ హోటల్లో పట్టుబడిన రూ.6.67 కోట్లను ఎన్నికల కోడ్ కింద పోలీసులు, IT అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే.
Similar News
News January 15, 2025
KNR: కనుమ పండుగనే పశువుల పండుగ!
కనుమను రైతులు పశువుల పండుగగా వ్యవహరిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన పశుపక్షాదులనూ ఈరోజు పూజిస్తారు. ఎద్దులను, ఆవులను, గేదెలను వాగులు, చెరువుల వద్దకు తీసుకెళ్లి స్నానాలు చేయించి, ఈత కొట్టిస్తారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది పూజిస్తారు.
News January 15, 2025
అంబరాన్నంటిన కొత్తకొండ జాతర
ఉమ్మడి కరీంనగర్ జల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరభద్రస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల మండల ప్రజలు ఎడ్లబండ్ల రథాలతో కొత్తకొండకు వచ్చారు. వీరభద్రస్వామికి కోరమీసాలు, కోడెమొక్కులు, గుమ్మడికాయలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శరభ శరభ స్లోగన్స్‌తో మారుమోగింది.
News January 15, 2025
విద్యుత్ కాంతులతో కొత్తకొండ వీరన్న ఆలయం
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.