News March 5, 2025

కరీంనగర్: చెల్లని ఓట్లు 28,686

image

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలలో మొత్తం 2,52,029 మంది ఓటు వేయగా అందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. 1,11,672 ఓట్లను కోటా నిర్ధారణ ఓట్లుగా నిర్ణయించారు. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యత లభించింది.

Similar News

News November 25, 2025

సాయంత్రం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

image

మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల వివరాలను రోహిత్, సూర్య, మాథ్యూస్, హర్మన్‌తో ICC రివీల్ చేయించనుంది. IND, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో 20జట్లు పాల్గొంటాయి. PAK మ్యాచులన్నీ లంకలో జరుగుతాయి. IND డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన ఫైనల్లో RSAపై 7 రన్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.

News November 25, 2025

ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

image

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు

News November 25, 2025

జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

image

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.