News March 5, 2025

కరీంనగర్: చెల్లని ఓట్లు 28,686

image

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలలో మొత్తం 2,52,029 మంది ఓటు వేయగా అందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. 1,11,672 ఓట్లను కోటా నిర్ధారణ ఓట్లుగా నిర్ణయించారు. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యత లభించింది.

Similar News

News March 25, 2025

శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య

image

అత్యంత వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతోంది. ఏప్రిల్ 6న జరిగే శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించేలా నగరం మెుత్తం భారీ LED స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఆశ్రమాలలో వసతి సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని దేశవ్యాప్తంగా తిలకించేలా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

News March 25, 2025

NRML: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 25, 2025

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

image

హైదరాబాద్‌లో 23 ఏళ్ల యువతి వేధింపుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి దూకి గాయాల పాలైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నగరంలో మహిళల భద్రతను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని ఈ సంఘటన ఎత్తి చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

error: Content is protected !!