News September 30, 2024
కరీంనగర్ చేరుకున్న మంత్రి సీతక్క
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ మహాత్మనగర్‌లో మిషన్ భగీరథ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ పమేలా సత్పతి, మిషన్ భగీరథ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి సీతక్క కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
Similar News
News October 10, 2024
జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకటరావుపేట రోడ్డుపై హోండా షోరూం ముందు ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు విధులు నిర్వహిస్తున్న సుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 10, 2024
కరీంనగర్: తమ్ముడిని చంపిన అన్న
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో మంగళవారం అర్ధరాత్రి తమ్ముడిని అన్న చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రేమలత-రాజయ్యకు కుమారులు కుమారస్వామి, చంద్రయ్య. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా, వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో చంద్రయ్య మద్యం తాగి అన్నతో గొడవకు దిగాడు. ఆవేశంతో కుమారస్వామి ఇనుపరాడ్‌తో దాడి చేయగా చంద్రయ్య చనిపోయాడు.
News October 10, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,08,966 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.54,712, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.35,920, అన్నదానం రూ.18,334,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.