News March 26, 2025
కరీంనగర్: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు అమాత్య యోగం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం కేబినెట్లో ఉన్నారు.
Similar News
News November 22, 2025
‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
News November 22, 2025
తుని: రైలు నుంచి జారిపడి ఒకరు మృతి

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. శనివారం రేగుపాలెం-ఎలమంచిలి రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణించిన ట్రైన్ నుంచి జారి పడి ఇతను మరణించి ఉండవచ్చని రైల్వే పోలీసులు చెబుతున్నారు. మృతుడికి 30 ఏళ్లు ఉంటాయని, మిలిటరీ గ్రీస్ కలర్ ఫుల్ హాండ్స్ టీషర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడని చెప్పాడు.
News November 22, 2025
VKB: మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ స్నేహ

శాంతి భద్రతే తొలి ప్రాధాన్యమని, మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన స్నేహ మెహ్రా శనివారం నూతన ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల భద్రతకు, రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.


