News March 26, 2025

కరీంనగర్: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

image

మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అమాత్య యోగం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం కేబినెట్లో ఉన్నారు.

Similar News

News April 18, 2025

కరీంగనర్: ఏప్రిల్ 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ

image

గురువారం హైదరాబాద్ నుంచి ‌రాష్ట్ర మున్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ LRSపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రచారం కల్పించాలన్నారు. ఫీజు చెల్లిస్తే లేఔట్ల ‌భూక్రమబద్ధీకరణ మంజూరు పత్రాలను జారీ చేయాలని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని‌ ఆదేశించారు. ఏసీ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2025

గన్నేరువరంలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన

image

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో గురువారం భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ హాజరై మాట్లాడారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన కల్పించారు. భూభారతిపై ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News April 17, 2025

కరీంనగర్: డిజిటల్ తరగతులను ప్రారంభించిన కలెక్టర్

image

కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. డిజిటల్ విద్యా బోధనతో విద్యార్థులకు త్వరగా అవగాహన కలుగుతుందన్నారు. ఉపాధ్యాయులు మెలకువలతో పాఠాలను బోధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు అధికంగా వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

error: Content is protected !!