News August 15, 2024

కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: శ్రీధర్ బాబు

image

KNR జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్‌లో నేడు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200లోపు యూనిట్ల వారికి ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.

Similar News

News November 12, 2025

కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమీషనర్ HYD ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2025- 26 సంవత్సరానికి చెందిన 9వ,10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. www.tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రూ.4 వేలు మంజూరు అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 12, 2025

జాతీయస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈనెల 6, 7వ తేదీలలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగిన రాష్టస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో 9వ తరగతికి చెందిన యన్.ప్రమధశ్రీ యస్.శ్రీసాన్విక, కే.శ్రీవికాస్, కే.వైష్ణవి జాతీయ స్థాయి కళా ఉత్సవ్(జాతీయస్థాయి) పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థులను ఈరోజు కలెక్టర్ పమేలా సత్పత్తి కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు.

News November 11, 2025

ఖమ్మం డీఈఓగా చైతన్య జైనీ బదిలీ

image

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖాధికారి (డీఈఓ)గా కరీంనగర్ డీఈఓ చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన చైతన్య జైనీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కాగా, కరీంనగర్ డీఈఓగా డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య కొనసాగనున్నారు.