News March 17, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 41.6°C నమోదు కాగా, కొత్తపల్లి-ధర్మారం 40.9, వీణవంక 39.6, జమ్మికుంట, తాంగుల 39.3, చింతకుంట 39.0, ఇందుర్తి, ఈదులగట్టేపల్లి 38.8, ఆసిఫ్ నగర్ 38.7, నుస్తులాపూర్ 38.5, ఖాసీంపేట 38.4, మల్యాల 38.1, గంగాధర 38.0, బోర్నపల్లి, రేణికుంట 37.9, పోచంపల్లి 37.8, వెదురుగట్టు, కరీంనగర్ 37.7, గుండి 37.6°Cగా నమోదైంది.
Similar News
News October 15, 2025
కరీంనగర్: ‘న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి’

KNR కలెక్టరేట్ ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్పై బూటు విసిరిన ఘటనకు నిరసనగా అంబేద్కర్ వాదులు దీక్ష చేపట్టారు. తలారి సుధాకర్, కునమల్ల చంద్రయ్య సహా పలువురు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీం కోర్టులో రాకేశ్ కిషోర్ చేసిన ఈ చర్యను వారు తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
News October 15, 2025
ఆర్డీవో నివేదిక జాప్యంపై కరీంనగర్ కలెక్టర్కు ఫిర్యాదు

135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణిలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడని వీఆర్ఏపై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్డిఓను 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్డీఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12న విచారణ పూర్తి చేసిన తుది నివేదిక అందించలేదని వాపోయాడు.
News October 15, 2025
KNR: నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమం

స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి అధ్యక్షతన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డా.మొగిలి, డా.లక్ష్మణరావు, పెద్ది స్వరూప, డా.స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.