News August 8, 2024

కరీంనగర్ జిల్లాలో తగ్గిన ‘రియల్’ జోరు

image

కరీంనగర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. కొన్ని మాసాలుగా భూముల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భూములు అమ్ముడుపోక ఆర్థిక అవసరాలకు సదరు భూ పత్రాలతో అధిక వడ్డీకి ఫైనాన్స్ తీసుకుంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా.. భూ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.20 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రోజుకు రూ.15 కోట్లు దాటట్లేదని తెలుస్తోంది.

Similar News

News September 10, 2024

బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ప్రజావాణిలో వికలాంగుడి నిరసన

image

తనకు వికలాంగుల పెన్షన్ తో పాటుగా బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ఓ దివ్యాంగుడు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన సాయిలు అయిదేళ్ల క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి పనులకు వెళ్లలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు.

News September 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాళోజి జయంతి. @ ధర్మారం మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ ముస్తాబాద్ మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ తంగళ్ళపల్లి మండలంలో విద్యుత్ షాక్ కు గురైన విద్యార్థిని. @ జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ ల దరఖాస్తులకు గడువు పెంపు. @ గురుకులాలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించిన సిరిసిల్ల కలెక్టర్. @ సిరిసిల్ల ప్రజావాణికి 96 ఫిర్యాదులు.

News September 9, 2024

జగిత్యాల: తొమ్మిది మంది ఎమ్మార్వోల బదిలీ

image

జగిత్యాల జిల్లాలో 9 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. కథలాపూర్ ఎమ్మార్వోగా వి.వినోద్‌, పెగడపల్లి MROగా రవీందర్ నియామకమయ్యారు. ఆర్.శ్రీనివాస్ మెట్పల్లికి, కథలపూర్‌లో పనిచేస్తున్న ముంతాజ్బుద్ధిన్ బీర్పూర్ బదిలీ అయ్యారు. ఏ.శ్రీనివాస్ జగిత్యాల రూరల్, సి.రామ్మోహన్ జగిత్యాల అర్బన్‌కు బదిలీ చేశారు. వరందన్ సారంగాపూర్, రమేష్ కొడిమ్యాలకు బదిలీ అయ్యారు.