News February 22, 2025
కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్ (2/2)

✓ కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ కు ఏం తెచ్చడో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
✓ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✓ చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు
✓ ఇల్లందకుంట: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టిన తెలంగాణ ఉద్యమకారులు
✓ చిగురుమామిడి: యూరియాపై వస్తున్న వదంతులు నమ్మొద్దు: మండలం వ్యవసాయ అధికారి రాజుల నాయకుడు
✓ మొలంగూర్ లో క్షయ వ్యాధి నివారణ మొబైల్ క్యాంప్
Similar News
News February 23, 2025
కరీంనగర్: పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న తెలంగాణ గిరిజనుల సంక్షేమ డిగ్రీ కళాశాల, మైనారిటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రవేశపరీక్ష కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News February 22, 2025
KNR: రంజాన్ మాసం సందర్భంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

వచ్చే నెల 2 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం ఏర్పాట్లపై ముస్లిం మతపెద్దలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
News February 22, 2025
చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు

చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. జూనియర్లపై దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలుంటాయని స్కూల్ డైరెక్టర్ కేసీ రావు తెలిపారు. విషయాన్ని గోరంతను కొండంతలు చేశారని, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న స్కూల్‌ను బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులు ఎన్నో మెడల్స్ సాధించారని తెలిపారు.